Tuesday, August 19, 2014

Makineedi Surya Bhaskar-మాకినీడి సూర్య భాస్కర్

  •  

  •  
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ --Makineedi Surya Bhaskar-మాకినీడి సూర్య భాస్కర్-- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....



కవితా చిత్రకారుడు మాకినీడి-- శ్రీ మాకినీడి సూర్య భాస్కర్ పేరెన్నిక గల కవి, విమర్శకుదు మరియు చిత్రకారుదు. ఈయన 1962, ఆగస్ట్ 17న కాకినాడలొ మాకినీడి శ్రీరంగనాయకులు , శ్రీమతి సరస్వతి దంపతులకు జన్మించారు. తొమ్మిదవ తరగతి చదువుతున్న కాలం లొనే 'సుమ కవితాంజలి ' అనే ఖండ కావ్యాన్ని రాశారు. తరువాత కాలంలొ దీనిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు పుస్తక రూపేణా అచ్చు వేయించారు. జీవిత భాగస్వామి మనసెరిగి మసలుకునే అనుకూలవతి శ్రీమతి సుభద్ర.

ఈయన వృత్తి అధ్యాపకత్వం. ఆంగ్ల ఉపాధ్యాడు. ప్రవృత్తి సాహిత్యం, చిత్రలేఖనం. అంటే కలం పట్టుకుని ఒక వైపు భావ చిత్రాలు రచిస్తూనే, మరొ పక్క కుంచెతొ విన్యాసాలు చేసే సత్తా ఉన్న కళాకారునిగా మనకు కనిపిస్తారు. ఈయన యాభై జలవర్ణ చిత్రాలు, ఇరవై మినీయేచర్లు గీయడమే కాకుండా కళా విమర్శక వ్యాసాల సంపుటి 'కళాతొరణం' (తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ) కూడా వెలువరించారు.

  • =====================
Visit My website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment