Monday, March 24, 2014

Janammadi hanumachastry,జానమద్ది హనుమచ్ఛాస్త్రి

  •  
  •  image : courtesy with Swati Telugu weekly.

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -జానమద్ది హనుమచ్ఛాస్త్రి- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


జానమద్ది హనుమచ్ఛాస్త్రి తెలుగులో ఒక విశిష్టమైన బహు గ్రంథ రచయిత. జానమద్ది కథా రచనే కాకుండా వివిధ పత్రికలలో, సంచికలలో 2,500 పైగా వ్యాసాలు రాసాడు. 16 గ్రంథాలు వెలువరించాడు. మా సీమకవులు, నాట్యకళాప్రపూర్ణ బళ్ళారి రాఘవ జీవిత చరిత్ర, కస్తూరి కన్నడ సాహిత్య సౌరభం 2, కడప సంస్కృతి- దర్శనీయ స్థలాలు, రసవద్ఘట్టాలు, మన దేవతలు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత చరిత్ర, సి.పి.బ్రౌన్ చరిత్ర మొదలైన గ్రంథాలు ప్రచురించాడు.


  • జన్మ నామం --    జానమద్ది హనుమచ్ఛాస్త్రి,
  • జననం --    సెప్టెంబరు 5, 1926,అనంతపురం జిల్లా రాయదుర్గం,
  • మరణం --    ఫిబ్రవరి 28, 2014 (వయసు 87)
  • ఇతర పేర్లు--     జానమద్ది హనుమచ్ఛాస్త్రి,
  • ప్రాముఖ్యత --    విశిష్టమైన బహు గ్రంథ రచయిత.
  • వృత్తి --    ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడు,


1946లో బళ్ళారి లోని ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడు ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. కడప లో సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథాలయ ట్రస్టును నెలకొల్పి, దాని కార్యదర్శిగా అహర్నిశలూ పాటుపడి 10 లక్షల రూపాయల విరాళాలు సేకరించాడు. వీరి కృషితో అది వాస్తవ రూపం ధరించింది. ఈ కేంద్రానికి 15 వేల గ్రంథాలను శాస్త్రి సేకరించి, బ్రౌన్ ద్విశతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాడు.


శాస్త్రి కి అనేక అవార్డులు లభించాయి. గుంటూరులో అయ్యంకి వెంకటరమణయ్య అవార్డు,
అనంతపురం లలిత కళా పరిషత్ అవార్డు,
ధర్మవరం కళాజ్యోతి వారి సిరిసి ఆంజనేయులు అవార్డు,
కడప సవేరా ఆర్ట్స్ వారి సాహితీ ప్రపూర్ణ అవార్డు,
మదనపల్లి భరతముని కళారత్న అవార్డు,
తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారం,
బెంగళూరులో అఖిల భారత గ్రంథాలయ మహాసభ పురస్కారం.................... వంటి అనేక పురస్కారాలు వీరికి లభించాయి.

కడపలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 28-ఫిబ్రవరి-2014 న వీరు పరమపదించారు.
  • ================================
Visit My website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment